Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'అవెంజర్స్-ఇన్ఫినిటీ వార్'... టికెట్లకు ఫుల్ డిమాండ్!

  • సరాసరి రివ్యూ 4 స్టార్
  • అలరిస్తున్న యాక్షన్ సన్నివేశాలు
  • ఇండియాలో 2 వేలకు పైగా థియేటర్లలో విడుదల
నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'అవెంజర్స్-ఇన్ఫినిటీ వార్' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సినీ విశ్లేషకుల సరాసరి రివ్యూ '4 స్టార్' గా ఉంది. ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూసే థానోస్ కు ఎదురెళ్లే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, థోర్, ఐరన్ మ్యాన్, హల్క్ తదితర సూపర్ హీరోస్ కలసికట్టుగా పోరాటం చేయడమే చిత్ర కథాంశం. ఈ సినిమాలో అలరించే యాక్షన్ సన్నివేశాలున్నాయని, ప్రతి సూపర్ హీరో యాక్షన్ సీన్స్ అద్భుతమని, క్లయిమాక్స్ హైలైట్ అని విశ్లేషకులు అంటున్నారు.

తన ఆయుధాన్ని తిరిగి తయారు చేసుకునే థోర్, దాడికి దిగే సన్నివేశాలు, బ్లాక్ పాంథర్ టీమ్ ను తొలిసారిగా తెరపై చూపించే సీన్ లు సూపరని చూసినవారు అంటున్నారు. ఇక తెలుగు వర్షన్ లో థానోస్ కు రానా డబ్బింగ్ చెప్పడం గమనార్హం. గతంలో ఏ హాలీవుడ్ చిత్రమూ విడుదలకానంతగా, దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్లలో 'అవెంజర్స్-ఇన్ఫినిటీ వార్' విడుదల కాగా, హైదరాబాద్ లో ఈ వారాంతానికి టికెట్లు అయిపోయినట్టు తెలుస్తోంది.
Avengers
New Movie
Review

More Telugu News